మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       

 

Sri Subrahmanya Pancharatnam – శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం


షడాననం చందనలేపితాంగం
మహోరసం దివ్యమయూరవాహనమ్ |
రుద్రస్యసూనుం సురలోకనాథం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 1 ||

జాజ్వల్యమానం సురబృందవంద్యం
కుమారధారాతట మందిరస్థమ్ |
కందర్పరూపం కమనీయగాత్రం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 2 ||

ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం
త్రయీతనుం శూలమసీ దధానమ్ |
శేషావతారం కమనీయరూపం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 3 ||

సురారిఘోరాహవశోభమానం
సురోత్తమం శక్తిధరం కుమారమ్ |
సుధార శక్త్యాయుధ శోభిహస్తం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 4 ||

ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం
ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ |
గంగోద్భవం సర్వజనానుకూలం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 5 ||

యః శ్లోకపంచకమిదం పఠతీహ భక్త్యా
బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ |
ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టం
అంతే స గచ్ఛతి ముదా గుహసామ్యమేవ || 6 ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నమ్ |

 


 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.